bad time for the KCR governmentతెలంగాణలో తెరాస కు బ్యాడ్ టైమ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? చాలా మంది దుబ్బాక ఉపఎన్నికల తరువాత అనుకుంటారు అయితే నిజంగా బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది మాత్రం నిరుడు హైదరాబాద్ లో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడినప్పుడే. అప్పుడు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యి ప్రజలు అష్టకష్టాలు పడ్డారు.

ఆ ఎఫెక్ట్ ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసి ఎన్నికల మీద పడ్డాయి. తెరాస కు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇకపోతే మరోసారి వర్షాకాలం వచ్చింది. దానితో ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెడుతుంది. నాలాల్లో పూడికతీత, రోడ్ల మరమ్మత్తు అంటూ ప్రభుత్వ అధికారులు పరుగులుపెడుతున్నారు. ఈసారి వర్షాలు ఏ స్థాయిలో కురిసినా అందుకు సన్నద్ధంగా ఉండాలి.

మరోసారి విఫలమైతే ఈ సారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. అయితే క్షేత్ర స్థాయిలో హడావిడి తప్పితే జరిగిన పనులు అంతంత మాత్రమే అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ లో ఇబ్బంది అంటే కేవలం ఒక జిల్లా రెండు జిల్లాల ఇబ్బంది కాదు. రాజధానిలో రాష్ట్రం నలుమూలల నుండీ ప్రజలు వచ్చి ఉంటారు.

వారి మీద ఎఫెక్ట్ పడితే ఆ ఎఫెక్ట్ ని వారు తమ సొంత ఊర్లకు కూడా చేరుస్తారు. పైగా మీడియా దృష్టాంతా హైదరాబాద్ మీదే ఉంటుంది కాబట్టి తప్పులు పెద్దవిగా కనిపిస్తాయి. ఇంకా పరిస్థితి చెయ్యిదాటితే దేశం మొత్తం మీద పరువు పోతుంది (జాతీయ మీడియా కవేరేజ్ కారణంగా). కాబట్టి ఈ వర్షాకాలం కేసీఆర్ సర్కారుకు గడ్డు కాలమనే చెప్పుకోవాలి.