pawan kalyan sent 3 lakhs cash to bhimavaram fans‘జనసేన’ పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన తమ అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలగాలని ఆశించే వారందరికీ ఓ చేదు వార్త అందుతోంది. వర్తమాన రాజకీయాలకు దూరంగా ఉంటూ తన రాజకీయ భవిష్యత్తును పవన్ తానే ప్రశ్నార్ధకం చేసుకుంటున్నారని విశ్లేషకులు చేసిన వ్యాఖ్యలను పవన్ రుజువు చేసే విధంగా అడుగులు వేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ నటిస్తున్న “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమానే పవర్ స్టార్ చివరి సినిమా అని ఇటీవల ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేసిన విషయం. అయితే తాజాగా పవన్ మరో సినిమాకు సిద్ధమవుతున్నారని ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న విషయం. దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్మించబోతున్న సినిమాకు దర్శకుడు ఫైనల్ అయ్యారని, గతంలో పవన్ తో అవకాశం వచ్చి, చేజారిన (రచ్చ, బెంగాల్ టైగర్ ఫేం) సంపత్ నందిని ఎంపిక చేసినట్లుగా సమాచారం.

అన్నీ కుదిరితే రాబోతున్న సంక్రాంతికి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించవచ్చని, హీరోయిన్ ఇతర కాస్టింగ్ ను కూడా ఎంపిక చేస్తున్నారట. పూజా కార్యక్రమాలు సంక్రాంతికి జరిగినా, ప్రస్తుతం సెట్స్ పై ఉన్న “సర్ధార్ గబ్బర్ సింగ్” చిత్రం పూర్తయిన తర్వాతే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టుకుంటుంది. అయితే పవన్ వరుసగా చిత్రాలను అంగీకరిచడం సినీ అభిమానులకు సంతోషం కలిగించే వార్తే కానీ, పవన్ రాజకీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మరో ‘తప్పటడుగు’ అని విశ్లేషిస్తున్నారు.