Babu-baga-busy-movie-leakedవిడుదలకు ముందే లీక్ లు కావడం అనేది సహజంగా పెద్ద సినిమాలకు జరుగుతూ ఉంటాయి. కానీ తాజాగా ‘బాబు బాగా బిజీ’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. మొత్తం సినిమా కాదు గానీ, ఈ సినిమాలో ఓ హాట్ సన్నివేశం లీకై వాట్సప్ గ్రూప్ లలో సందడి చేస్తోంది. అసలే హాట్ హాట్ గా ఈ సినిమా తెరకెక్కిందన్న వార్తలతో పబ్లిసిటీ బాగా వచ్చింది. అయితే ఈ ప్రచారాన్ని బలపరిచే విధంగా ఈ హాట్ సన్నివేశం చక్కర్లు కొడుతుండడం విశేషం.

కధలో భాగంగా అవసరాల శ్రీనివాస్ చేసే రొమాంటిక్ సన్నివేశాలలో సుప్రియతో చేసిన ఘాటు సీన్ లీక్ అయ్యింది. సుప్రియ బ్లౌజ్ తీసి బ్యాక్ లెస్ గా చూపించిన ఈ సీన్ లో అవసరాల – సుప్రియల మధ్య హాట్ హాట్ లిప్ లాక్ కూడా ఉంది. బాలీవుడ్ ‘హంటర్’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో, అందులో ఉన్న సీన్ మాదిరే కిచెన్ లో సుప్రియతో ఘాటు రొమాన్స్ నే అవసరాల చేసినట్లుగా కనపడుతోంది. అయితే సినిమా విడుదలకు ఒక రోజు ముందుగా ఈ సీన్ లీక్ కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి 2’ ప్రభంజనం ఒక్కటే కనపడుతోంది. దీనిని అధిగమించి ప్రేక్షకులను రాబట్టుకోవాలంటే సాధ్యమయ్యే విషయం కాదు. దీంతో కావాలనే ఈ సీన్ ను లీక్ చేసి ఉంటారన్న భావన ట్రేడ్ వర్గాలలో వ్యక్తమవుతోంది. ఈ లీకేజ్ ద్వారా పబ్లిసిటీ తీసుకువచ్చి, యూత్ లో కాస్త క్రేజ్ ను తీసుకురావచ్చని చిత్ర యూనిట్ భావించిందో లేక మరెక్కడి నుండైనా ఈ సీన్ లీక్ అయ్యిందేమో గానీ, ‘బాబు బాగా బిజీ’ ఏమో గానీ, ‘బాబు ఫుల్ హాట్’ అంటూ కితాబిస్తున్నారు.