Babli project case on chandrababu naidu2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు నాయుడు తెలంగాణ సరిహద్దుదాటి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు.

చంద్రబాబుతో పాటు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసిన మహారాష్ట్ర పోలీసులు నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి ఈ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్ర వాసి ధర్మాబాద్‌కోర్టులో పిటిషన్‌ వేయడంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ కేసులో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

అయితే ధర్మాబాద్‌ కోర్టు నోటీసులు ఇస్తే చంద్రబాబు, తెదేపా నేతలు కోర్టుకు హాజరవుతారని మంత్రి లోకేశ్‌ వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం సినిమా యాక్టర్ శివాజీ మాట్లాడుతూ కేంద్రం చంద్రబాబు మీద కుట్ర చేస్తుందని, చంద్రబాబుకు త్వరలోనే నోటీసులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఆ నోటీసు ఇదేనా?