Baba Sehgal Wants to sing for Mahesh Babuసింగర్ గా పరిచయం అవసరం లేని పేరు బాబా సెహగల్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు తన గాత్రాన్ని అందించి, టాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన బాబా సెహగల్, ఆ తర్వాత తెలుగులో చాలా మంది టాప్ హీరోల పాటలను ఆలపించారు. నాడు చిరంజీవితో మొదలైన ప్రస్థానంలో పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్, రవితేజలు ఉండగా, తనకు ఒక్క లోటు మాత్రం ఉండిపోయిందని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

‘పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎక్కువగా పాడడం వలన తనను పవర్ సింగర్ గా పిలుస్తారని, అయితే తాను ఇప్పటివరకు మహేష్ బాబుకు మాత్రం పాడలేకపోయానని, ఆ లోటు త్వరలో పూడుతుందని భావిస్తున్నాని’ చెప్తూ… ‘మహేష్ గారు… ఒక్క ఛాన్స్ ప్లీజ్…’ అంటూ నవ్వుతూ తన విజ్ఞప్తిని బయటపెట్టాడు బాబా. ఇప్పటివరకు పరిచయం ఉన్న హీరోలలో ప్రభాస్ చాలా ఫ్రెండ్లీగా, సింపుల్ గా ఉంటారని, కనిపించినప్పుడల్లా ‘హలో బాబా’ అంటూ సంభోదిస్తారని తెలిపారు.