Baahubali2, Baahubali2 Tamil Rights Price, Baahubali2 Kollywood Rights Price, Baahubali2 Tamil Version Rights Price, Baahubali2 Tamil Rights 45 Crore Recordభారతీయ చలన చిత్ర రికార్డులను తిరగరాసిన తెలుగు సినిమా ‘బాహుబలి-2’పై కూడా విడుదలకు ముందే కాసుల వర్షం కురుస్తోంది. ఇంకా షూటింగ్ పూర్తి కాని ఈ చిత్రానికి సంబంధించిన తమిళ అనువాద హక్కులు 45 కోట్లకు అమ్ముడైపోయాయి. ఈ మేరకు ఈ చిత్ర యూనిట్ కు చెందిన ఓ కీలక వ్యక్తి దేశీయ న్యూస్ ఏజెన్సీ ‘ఐఏఎన్ఎస్’కు చెప్పారు. అయితే సదరు హక్కులు కొనుగోలు చేసిన వ్యక్తి పేరును మాత్రం బయటపెట్టలేదు.

తమిళ హక్కులు 45 కోట్లకు అమ్ముడుబోయిన మాట వాస్తవమేనని చెప్పిన సదరు వ్యక్తి, ఆ హక్కులను దక్కించుకున్న వ్యక్తి పేరును గోప్యంగా ఉంచాలని చిత్ర యూనిట్ నిర్ణయించిందని చెప్పారు. వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తుండగా, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, అనుష్క తదితర భారీ తారాగణం నటిస్తున్నారు.

టాలీవుడ్ సూపర్ హిట్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టనుందని ఇప్పటినుండే జాతీయ మీడియాలో ఆసక్తికర కథనాలు వెలువడుతున్నాయి. అయితే అన్నింటా విజయం సాధించిన ‘బాహుబలి’ సినిమా, ఇటీవల చైనాతో పలు ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో బొక్కబోర్లా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రభావం ఏమీ ‘బాహుబలి 2’పై కనపడకపోవడాన్ని, ప్రస్తుత తమిళ మార్కెట్ హక్కులే చాటిచెప్తున్నాయి.