baahubali-rajamouli-vs-shankar-2-0-movieబాహుబలి సినిమా రెండు భాగాలుగా వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక రోబో 2.0 సినిమా భారీ ఓపెనింగ్స్ తో, బ్రహ్మాండమైన టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఒక పక్క రాజమౌళి, ఒక పక్క శంకర్ ఇద్దరూ భారత చలన చిత్ర సినిమాలను శాసించే ఉద్దండులే. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్..ఆ స్టైల్ తో బాక్స్ ఆఫీస్ ను కలెక్షన్స్తో పరుగులు పెట్టిస్తున్నారు. మరి అలాంటి ఇద్దరి గురించి మా వాడు గొప్ప అంటే మా వాడు గొప్ప అంటూ దాన్ని ఒక “రాష్ట్ర-బాషల” మధ్య విభేదంలాగా రచ్చ మొదలయ్యింది సోషియల్ మీడియాలో.

నిజమే బాహుబలి సృష్టికర్త రాజమౌళి చాలా గొప్పోడు..తీసిన కధను మళ్లీ తియ్యకుండా ప్రేక్షకులను తన కధ-కధనంతో కట్టి పడేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే వాడు రాజమౌళి. కమీడీయన్తో సినిమా తీసి క్లాసిక్ హిట్ ఇచ్చిన టాలెంట్ ఉన్న వాడు రాజమౌళి. అయితే సంచలనాల డైరెక్టర్ శంకర్ ఏమైనా తక్కువ తిన్నాడా?

ఒక్క సారి ఆయన కరియర్ ను తీసుకుంటే దక్షిణ భారదేశ చలన చిత్ర చరిత్రలో తన సినిమాలో ఒక సామాజిక అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రజలను తన కధతో మంత్ర ముగ్దుల్ని చేసి, ఔరా అనిపించినా స్థాయి అతని. ఇంకా పచ్చిగా మాట్లాడుకుంటే శంకర్ సినిమా తీసే విధానం ఇప్పటివరకూ ఎవ్వరూ తియ్యలేని స్థాయిలో ఉంటుంది. ఆయన ఊహ విధానమే అంత ఫాస్ట్ ఫోర్వర్డ గా ఉంటుంది అంటే నమ్మి తీరాల్సిందే. మరి ఈ ఇద్దరిలో ఒకరు గొప్ప అంటే, ఒకరు గొప్ప అన్న గొడవ అసలు ఎందుకు మొదలు పెట్టారో అర్ధం కానీ పరిస్థితి.

అయితే ఒకటి మాత్రం నిజం మనం ఎన్ని మాట్లాడుకున్నా, తొడలు కొట్టి జబ్బలు చరుచుకున్నా సినిమా ప్రపంచంలో సినిమా ఎంత కలెక్ట్ చేసింది అన్న అంకేలే ముఖ్యం తప్పా వేరే ఏం కాదు. మరి ఆ లెక్క పక్కాగా ఒక్కసారి చూసుకుంటే రాజమౌళి నిజంగా అందరికన్నా గొప్ప వాడు అని ఒప్పుకుని తీరాల్సిందే.