prabhas-rajamouli‘బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది? సినిమా కంటే ముందు ఫస్ట్ టీజర్ ఎప్పుడు వస్తుంది? దాని కంటే ముందు ఫస్ట్ లుక్ ఎప్పుడు? షూటింగ్ ఎప్పుడు ముగుస్తుంది? ఇలా ఎన్నో ఎన్నెన్నో సందేహాలు, ప్రశ్నలు సినీ అభిమానుల మదిలో ఉన్నాయి. వాటన్నింటిని స్వయంగా ‘బాహుబలి’ చిత్ర యూనిట్ అధికారికంగా ఓ సమాధానం చెప్పాలని భావించిందో ఏమో గానీ, ‘బాహుబలి’ చిత్ర యూనిట్ శుక్రవారం నాడు ఓ అధికారిక ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసారు.

దీంతో యంగ్ రెబల్ స్టార్ అభిమానుల మదిలో మరియు మరెందరో ప్రేక్షకులకు ఉన్న కొన్ని సందేహాలకు శుక్రవారం నాడు జవాబు లభించవచ్చు. ముఖ్యంగా అక్టోబర్ 23వ తేదీన ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ టీజర్ విడుదల కానుందన్న సమాచారం హల్చల్ చేసిన నేపధ్యంలో… దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి సమాచారం ఇస్తారో అన్న ఆసక్తి ప్రభాస్ ఫ్యాన్స్ లో వ్యక్తమవుతోంది. అలాగే ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్ర యూనిట్ ఓ కీలక సమాచారం ఇచ్చే అవకాశం ఉందంటూ తెలుస్తోంది.