baahubali-bgm-copied-from-anr-keelu-gurramఈమధ్య సాంగ్స్ రిలీజ్ అయిన కొద్దీ సేపట్లో ఆ సాంగ్ ట్యూన్స్ ఎక్కడ్నుంచి కాపీ కొట్టారో కనిపెట్టేస్తున్నారు నెటిజన్లు. మన సంగీత దర్శకులు చేసిన కొన్ని ట్యూన్స్ ఇంగ్లీష్, స్పానిష్ ఆల్బమ్స్ కి మక్కికి మక్కి దించేసి విమర్శలపాలు అయ్యారు. సంగీత దర్శకుడు తమన్‌ ట్యూన్స్‌ ఎక్కువ శాతం కాపీ కొట్టినవే అనే టాక్‌ ఇండస్ట్రీలో ఉంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మహేష్ బాబు స్పైడర్, ఎన్టీఆర్ జై లవకుశ లో ట్యూన్స్ కాపీ కొట్టారని విమర్శలు వినిపించాయి.

తాజాగా ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్మాత్మాకంగా రూపొందించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన `బాహుబ‌లి` చిత్రానికి సంబందించిన ట్యూన్ కూడా కాపీ అని ఆలశ్యంగా వెలుగు లోకి వచ్చింది. “బాహుబలి” సినిమాకి ఎం. ఎం. కీరవాణి సమకూర్చిన థీమ్ మ్యూజిక్ అక్కినేని నాగేశ్వరావు నటించిన “కీలుగుర్రం” సినిమా లోనిది. ఆ సినిమాకు సంగీతం అందించింది గానగంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. తెలుగులో సినీ రంగంలో ఎం. ఎం. కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎం. ఎం. క్రీమ్ గా ప్రసిద్ధి చెందిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఈయన కాపీ కొట్టడమేంటని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.