Baahubali 2 Vs Maghadheera Fake Recordsప్రస్తుతం సినిమాలు ఎన్ని రోజులు ఆడాయి అన్నది లెక్క కాదు… ఎన్ని కోట్లు కొల్లగొట్టింది అన్నదే లెక్క… అన్న చందంగా తయారైన నేపధ్యంలో… బాక్సాఫీస్ వద్ద చెలరేగి కోట్లు కొల్లగొట్టిన “బాహుబలి 2” విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అంతకుముందు రామ్ చరణ్ – రాజమౌళిల “మగధీర” పేరిట ఉన్న 50 రోజుల సెంటర్స్ రికార్డు కనుమరుగైందని ప్రచారం జరిగింది.

‘బాహుబలి 2’ సినిమా ఏపీ, తెలంగాణాలలో 282 సెంటర్స్ లో 50 రోజులను పూర్తి చేసుకుందని, దీంతో ‘మగధీర’ పేరిట ఉన్న 262 సెంటర్స్ రికార్డు తుడిచి పెట్టుకుపోయిందనేది ట్రేడ్ టాక్. అయితే తమ అభిమాన హీరో రికార్డు పోయిందని భావించిన మెగా అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరతీసారు. ‘బాహుబలి 2’ డైరెక్ట్ సెంటర్స్ కేవలం 234 మాత్రమేనని, మిగతావి సెకండ్ రిలీజ్ వని చెప్పుకొస్తున్నారు.

ఆ లెక్కన ఇప్పటికీ 50 రోజుల సెంటర్స్ ‘మగధీర’ పేరిటే ఉన్నాయని సోషల్ మీడియా ద్వారా సరికొత్త వాదనను తీసుకువస్తున్నారు. ఇందులో వాస్తవం ఉండొచ్చు, లేకపోవచ్చు… అయితే తమ హీరోవి సాధించినవే రికార్డులు అన్న చందంగా మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మళ్ళీ ‘మగధీర’ రికార్డులను హైలైట్ చేస్తుండడం, అభిమానుల మధ్య మళ్ళీ ‘సెంటర్స్ రికార్డుల గోల’కు తెరలేపింది.

నిజానికి “మగధీర” సెంటర్స్ ఫేక్ రికార్డుల గురించి స్వయంగా రాజమౌళినే ఇటీవల బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా… ఆ సినిమా సాధించిన రికార్డుల గురించి గొప్పగా చెప్పుకోవాలా? అభిమానుల ఒత్తిడి మేరకు అల్లు అరవింద్ కొన్ని సెంటర్స్ లో ‘మగధీర’ సినిమాను ఆడించిన విషయం జక్కన్న చెప్పిన విషయం తెలిసిందే. మరి అలాంటి ఫేక్ రికార్డుల గురించి మళ్ళీ కొత్తగా ఫ్యాన్స్ కొట్టుకోవాలా? కాస్త ఆలోచించండి గురూ..!