Baahubali 2 Trailer Recordsతొలి 24 గంటల్లో యూ ట్యూబ్ ను ఓ కుదుపు కుదిపి సరికొత్త రికార్డులను సృష్టించిన “బాహుబలి 2” ఇండియన్ సినిమాలలో అగ్ర స్థానంలో నిలిచింది. మరి ఇంతటి ప్రభంజనం సృష్టించిన ఈ ట్రైలర్ ప్రపంచ సినిమాలతో పోటీపడే స్థాయిలో ఉందా? అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం లభిస్తోంది. తొలి 24 గంటల్లో ప్రపంచంలోని అత్యధిక క్లిక్స్ అందుకున్న ట్రైలర్ల జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ జాబితాలో “బాహుబలి 2” ఏకంగా టాప్ 13 స్థానాన్ని ఆక్రమించడం విశేషం.

తొలి 12 స్థానాలలో హాలీవుడ్ సినిమాలు నిలువగా, ఆ తర్వాత 13వ స్థానంలో 50 మిలియన్ (నాలుగు భాషలలో 5 కోట్ల క్లిక్స్) అందుకుని “బాహుబలి 2” సత్తా చాటింది. ఇలాంటి అరుదైన ఫీట్ ను అందుకోవడం నిజంగా తెలుగు సినిమాకు గర్వకారణంగా చెప్పాలి. ఒక్క తెలుగు భాషకు సంబంధించే ఈ రికార్డు సాధించకపోయినా, “బాహుబలి” సృష్టికర్త మన తెలుగు వారే కదా! భవిష్యత్తులో తెలుగు సినిమాకు మరిన్ని మంచి రోజులు రాబోతున్నాయన్న సంకేతాలు కనపడుతున్నాయి.