Baahubali 2 Trailer - Latest Newsఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుద‌ల కాబోతున్న ‘బాహుబలి – ద కన్‌క్లూజన్‌’ విశేషాలను తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి తెలిపారు. ముఖ్యంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “బాహుబ‌లి-2” థియేట్రికల్‌ ట్రైలర్‌ తేదీ ప్రకటించడానికి ఒక చిన్న ఇబ్బంది ఉందని పేర్కొన్నారు.

“నిజానికి ఇప్పటికే ట్రైలర్‌ కటింగ్‌ అయిపోయిందని, అయితే దాని తాలూకూ సీజీ షాట్లు రావాలని, అనంత‌రం సౌండ్‌ క్రియేట్‌ చేయడానికి రెండు మూడు రోజులు పడుతుంద‌ని చెప్పారు. ఒకవేళ తాము ట్రైలర్‌ తేదీ చెప్పేస్తే, అదే తేదీకి ఖచ్చితంగా విడుద‌ల చేయాల్సి ఉంటుంద‌ని, వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియో వాళ్లు కూడా అదే డేట్‌కి ఇస్తారని, మరోపక్క అభిమానులు కూడా తొందర పెడుతుంటారని, దాంతో క్వాలిటీ మిస్సయ్యే ప్రమాదముందని” ట్రైలర్ ఆలస్యానికి గల కారణాన్ని సవివరంగా తెలిపారు.

అందుకనే ట్రైలర్‌ విడుదల అయ్యే తేదీ ప్రకటించడం కష్టమైందని, అయితే ట్రైల‌ర్‌ ను మార్చి నెల మధ్యలో త‌ప్ప‌కుండా తీసుకొస్తామ‌ని స్పష్టం చేసారు. ‘బాహుబలి’ సినిమా తీయడానికి ఏ కథైతే మొదలుపెట్టామో, ఆ కథ ‘బాహుబ‌లి 2’తో పూర్తయిపోతుందని, ఈ సినిమాకి ముగింపు ఇచ్చేసి, సినిమాలోని పాత్రలను టీవీ సీరీస్‌ గానో, యానిమేషన్‌ గానో, కామిక్స్‌ గానో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామ‌ని చెప్పారు.