Baahubali -2 -the conclusion releasing on April 14, 2017సినిమాకు తగిన విధంగా పబ్లిసిటీ ఇవ్వడంలో ‘జక్కన్న’ను మించిన వారు తెలుగు సినీ పరిశ్రమలో లేరని ఘంటాపధంగా చెప్పవచ్చు. ఆ పబ్లిసిటీ వలనే ‘బాహుబలి’ సినిమా ఫస్ట్ పార్ట్ ఏకంగా 600 కోట్లు కొల్లగొట్టింది. విస్తృతమైన ప్రచారం కల్పించిన రాజమౌళి, ఆ సినిమా టీజర్ల విడుదల తేదీలలో కూడా స్పష్టత పాటించారు. చిత్ర యూనిట్ లోని ప్రముఖుల పుట్టినరోజుల నాడు వారి వారి క్యారెక్టర్లను రివీల్ చేస్తూ సందడి చేసిన రాజమౌళి, ‘బాహుబలి 2’కు మాత్రం వాటికి దూరంగా ఉంటున్నాడు.

మొదటి పార్ట్ అయిన హిట్టుతో రెండవ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్న నేపధ్యంలో షూటింగ్ కూడా మరింత గోప్యంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా తొలి టీజర్ విడుదల ముహూర్తాన్ని మాత్రం ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. 2017, ఏప్రిల్ 14వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ‘బాహుబలి 2’ రికార్డుల వేట అమ్మ వారి పండుగతో ప్రారంభం కానుందన్న మాట.