Baahubali 2 the conclusion one more dayతెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డులు అంటే… బాహుబలి రికార్డులు… నాన్ బాహుబలి రికార్డులుగా పేరుబడ్డాయి. అవును… ‘బాహుబలి’ సినిమా విడుదలై ఊహకందని రికార్డులను అందిపుచ్చుకున్న తర్వాత, ఇలా విభజించి లెక్కించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతలా ఏ సినిమాకు అందనంత ఎత్తులో “బాహుబలి” రికార్డులు నిలిచాయి. అయితే ఆ ఎత్తును మరింత పెంచేందుకు… వాటిని ఎవరెస్ట్ లో నిలబెట్టేందుకు ‘బాహుబలి 2’ ప్రేక్షకుల ముందుకు మరికొద్ది గంటల్లో రాబోతోంది.

ఇక నుండి తెలుగు సినీ పరిశ్రమలో రికార్డులు అంటే… ‘బాహుబలి 2’ రికార్డులు… ‘నాన్ బాహుబలి 2’ రికార్డులుగా పేర్కొనాల్సి ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. అంటే ‘బాహుబలి’ రికార్డులు కాలం చెల్లడానికి కూడా మరికొద్ది గంటలే మిగిలి ఉంది. శుక్రవారం నాటి నుండి సరికొత్త చరిత్ర లిఖించబడడం అన్న అంశం ఖాయం కావడంతో, గురువారం నాటితో ‘బాహుబలి’ రికార్డులకు ‘శుభంకార్డు’ పడనుంది. అయితే ఈ సినిమా ద్వారా సరికొత్త రికార్డులు నమోదైనప్పటికీ, హీరోహీరోయిన్లు, చిత్ర యూనిట్ విభాగం అంతా ఒక్కటే కావడంతో… వ్యక్తిగతంగా పెద్దగా ప్రాధాన్యత లభించకపోవచ్చు గానీ, ఇండస్ట్రీ లెక్కల పరంగా ‘బాహుబలి 2’ ఎవరెస్ట్ లో నిలుస్తుందని అంచనా.

ఒక్క తెలుగు విభాగంలోనే కాదు… ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ‘బాహుబలి 2’ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఈ రోజు ఓవర్సీస్ లో పడబోతున్న షోల నుండి గానీ, ఆలాగే ఏపీ, తెలంగాణాల వ్యాప్తంగా పడనున్న సెకండ్ షోల నుండి గానీ ప్రేక్షకుల టాక్ అదిరిపోతే, ఈ సినిమా ఉధృతి అంచనాలు వేయడం కూడా సాధ్యం కాకపోవచ్చన్న భావన వ్యక్తమవుతోంది. మరి ఇవ్వన్నీ తెలుసుకోవాలంటే… మరికొద్ది గంటలే మిగిలి ఉన్నాయి. అప్పటివరకు వేచిచూడండి..!