Baahubali 2 Telugu Collectionsభారీ అంచనాలతో విడుదలైన “బాహుబలి 2” అంచనాలను అందుకోవడంలో సక్సెస్ సాధించడంతో ఓపెనింగ్స్ లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించే పనిలో ఉంది. అందుకు నిదర్శనంగా తొలి రోజు ఏకంగా 100 కోట్ల రూపాయల షేర్ ను కొల్లగొట్టిందనే సమాచారం వెలువడింది. ఇక, రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 40 కోట్లకు పైగా వసూలు చేసిందని ట్రేడ్ పండితులు లెక్కలు చెప్తున్నారు. ఇటీవల కాలంలో అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ప్రకటించనప్పటికీ, ‘బాహుబలి 2’ కలెక్షన్స్ ను మాత్రం ఇండస్ట్రీలోని ప్రముఖ పీఆర్ఓ ద్వారా విడుదలయ్యాయి.

నైజాం – 8.70 కోట్లు
సీడెడ్ – 6.10 కోట్లు
నెల్లూరు – 2.10 కోట్లు
గుంటూరు – 6.18 కోట్లు
కృష్ణా – 2.82 కోట్లు
ఉత్తరాంధ్ర – 4.52 కోట్లు
తూ.గో. – 5.93 కోట్లు
ప.గో. – 6.08 కోట్లు
మొత్తం – 42.43 కోట్లు

ఈ 42 కోట్లు విలువ షేర్ వాల్యూ కావడంతో, గ్రాస్ 60 నుండి 70 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక, తెలుగు వర్షన్ కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కలెక్షన్స్ ను లెక్కిస్తే… అది 60 కోట్ల షేర్ పైనే ఉండవచ్చని ట్రేడ్ టాక్. అంటే గ్రాస్ విలువ దాదాపుగా 90 – 100 కోట్ల మధ్య ఉంటుందని, ప్రాంతీయ భాష అయిన ఒక తెలుగు సినిమాకు ఈ రేంజ్ సక్సెస్ బహుశా కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరని చెప్పవచ్చు. రాంగోపాల్ వర్మ చెప్పినట్లుగా… బిఫోర్ బాహుబలి… ఆఫ్టర్ బాహుబలి… అని టాలీవుడ్ ను విభజించక తప్పని పరిస్థితి నెలకొంది.