Baahubali 2 Tamil Distributor Controversyఓ వైపు ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో ‘బాహుబలి 2’ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ మొత్తం అహర్నిశలు కష్టపడుతుంటే, మరో పక్కన ఈ సినిమా విడుదల కావడానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కావేరి జల వివాదంలో ‘కట్టప్ప’ సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు గానూ కర్ణాటకలో ఈ సినిమాను విడుదల చేయనివ్వబోమని హెచ్చరికలు వస్తున్న నేపధ్యంలో… ప్రస్తుతానికి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలోనని చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడుతోంది.

దీనికి తోడు తాజాగా తమిళనాట మరో వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శరవణన్ తనకు రావాల్సిన 1.18 కోట్లు వచ్చేటంత వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసారు. దీంతో తమిళ సినీ ప్రేక్షకులలో కూడా ‘బాహుబలి 2’ విడుదలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. మరి చిత్ర నిర్మాతలు ఈ బకాయిలపై ఏమైనా మాట్లాడతారేమో చూడాలి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కు 600 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయన్న విషయం తెలిసిందే. మరి ఇంత మొత్తంలో వచ్చిన తర్వాత ‘బాహుబలి’ డబ్బులు పెండింగ్ పెట్టడం ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.