Baahubali-2-Sivaratri-poster-makingదర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న “బాహుబలి” ఓ విజువల్ వండర్ అన్న విషయం జగమెరిగిన సత్యమే. ప్రతి చిన్న షాట్ కూడా పర్ ఫెక్ట్ గా వచ్చేవరకు జక్కన్న వదిలిపెట్టరని, ఒక్కో సినిమాకు ఆయన తీసుకుంటున్న సమయమే చెప్తోంది. అలా పలు జాగ్రత్తలు తీసుకుంటూ, ఒక్కో సినిమాను ఒక్కో శిల్పంలా చెక్కే రాజమౌళి, తాజాగా శివరాత్రి సందర్భంగా ‘బాహుబలి 2’కు సంబంధించి ఓ పోస్టర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఏనుగుపై ఎక్కిన ప్రభాస్ స్టిల్ అద్భుతంగా ఉండడంతో… వీక్షకుల నుండి, నెటిజన్ల నుండి అమోఘమైన స్పందన తెచ్చుకుంది. అయితే ఈ స్టిల్ ఎలా తయారయ్యిందో తెలుసా? చిత్ర యూనిట్ ఎలా కూర్చోబెట్టిందో గానీ, ప్రభాస్ అభిమాని మాత్రం ఈ స్టిల్ ను మరింత అద్భుతంగా చెక్కారు. ఫోటోషాప్ చేస్తూ ఒక ఏనుగుపై ఎక్కించడమే కాకుండా, మరో ఏనుగు ఆశీర్వదిస్తున్నట్లుగా ఈ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

రాజమౌళి వదిలిన స్టిల్ కు మరింత హీరోయిజం తెప్పించే విధంగా ఉండడంతో సదరు వీడియో నెటిజన్ల నుండి మరింత స్పందనను తెచ్చుకుంటోంది. మొత్తానికి “బాహుబలి” తర్వాత యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఎంత ఉత్సాహంతో ఉన్నారనడానికి ఇలాంటి వీడియోలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. విడుదలకు ముందే పరిస్థితి ఇలా ఉంటే, ‘బాహుబలి 2’ విడుదల తర్వాత ఫ్యాన్స్ ఉత్తేజానికి అడ్డు ఉంటుందా?