Fantastic-first-day-at-war-baahubali‘బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమాకు అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ మొదలైంది. కొన్ని నెలల పాటు ప్లానింగ్ జరిగిన ఈ షూటింగ్ తొలిరోజు… అంతా అనుకున్నట్లుగా సజావుగా సాగిందని దర్శకధీరుడు రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ తెలిపారు.

‘బాహుబలి’ అభయ హస్తంతో కూడిన ఆ ఫోటోలో చిత్ర యూనిట్ సభ్యులంతా ‘జై మాహిష్మతి…’ అంటూ ఉరిమే ఉత్సాహంతో చేతులు పైకెత్తి జైజైలు కొడుతున్నారు. దర్శకధీరుడు రాజమౌళి అందరి కంటే ముందు వరుసలో ముందుండి నడిపిస్తున్నాడు. ‘బాహుబలి’ చేతికి అంటిన నెత్తుటి మరకలు, యుద్ధ సన్నివేశాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి. రాజమౌళి టేకింగ్ కు నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఫోటోను చూస్తూ పండగ చేసుకోవడం యంగ్ రెబల్ స్టార్ అభిమానుల వంతయ్యింది..!