Baahubali 2 Saahore Song promo - prabhas Rajamouliఏప్రిల్ 28వ తేదీన విడుదల కాబోతున్న రాజమౌళి “బాహుబలి 2”కు సంబంధించి ‘సాహోరే బాహుబలి’ టైటిల్ సాంగ్ శాంపిల్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. స్మాల్ స్క్రీన్ పైన చూస్తుంటేనే… ఐ ఫీస్ట్ లా కనపడుతున్న ఈ వీడియోను, రేపు విడుదలైన తర్వాత సిల్వర్ స్క్రీన్ పైన ఎన్ని సార్లు చూస్తారో సినీ అభిమానులకే తెలియాలి అనే విధంగా ఈ శాంపిల్ వీడియోను ఒకటికి పది సార్లు చూస్తూ సినీ ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు.

యంగ్ రెబల్ స్టార్ ను బాగా ఎలివేట్ చేసిన ఈ వీడియోలో ఒక షాట్ మాత్రం ‘వావ్’ అనిపిస్తోంది. నిజంగా ఇలాంటి షాట్స్ చిత్రీకరించాలన్న ఆ ‘విజన్’ దర్శకుడికి ఉండాలి, ఆ ఆహార్యం హీరోకు ఉండాలి. ఈ రెండు కలగలిపే విధంగా ఏనుగు విల్లు పట్టుకోగా, అందులో నుండి ప్రభాస్ బాణాన్ని సంధిస్తున్న విధానం… చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదని చెప్పడంలో సందేహం లేదు. అందుకే ఈ స్క్రీన్ షాట్ ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

విజువల్ వండర్ గా నిలిచిన ఈ పాటలో అన్ని షాట్స్ అద్భుతంగా ఉన్నాయి గానీ, ఈ షాట్ మాత్రం చూసే కొద్ది చూడాలనిపించే ఉందని చెప్పడంలో ‘ఇంచుమాత్రం’ కూడా అతిశయోక్తి కాదు. దీంతో సాహోరే బాహుబలి అన్న టైటిల్ సాంగ్ కాస్త… సాహోరే రాజమౌళి అంటూ దర్శకధీరుడు అభిమానులు… సాహోరే ప్రభాస్ అంటూ యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్… సందడి చేస్తున్నారు. ఇక సిద్ధం కండి సినీ పండితుల్లారా… అడ్వాన్సు బుకింగ్స్ లో దేశమంతా ఆల్ టైం రికార్డులు లెక్కపెట్టుకోవడానికి..!