Baahubali 2 - Saahore Baahubali Song Recordsప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త రికార్డులను సృష్టిస్తోన్న “బాహుబలి 2” మళ్ళీ నెట్టింట కూడా సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమైపోయాడు. అవును… వెండితెరను శాసిస్తోన్న తరుణంలోనే నెట్టింట్లో ‘బాహుబలి 2’కు సంబంధించిన ‘సాహోరే బాహుబలి’ ఫుల్ వీడియో సాంగ్ ను అధికారికంగా యూ ట్యూబ్ లో విడుదల చేసారు. లహరి మ్యూజిక్ – టి సిరీస్ ద్వారా విడుదలైన ఈ పాట, ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

టాలీవుడ్ కు సంబంధించిన వీడియో సాంగ్స్ విషయానికి వస్తే, ఇప్పటివరకు అత్యధిక క్లిక్స్ అందుకున్న జాబితాలో అల్లు అర్జున్ ‘రేసు గుర్రం’ సినిమాలోని మాస్ సాంగ్ ‘సినిమా చూపిస్త మావ’ పాట 25 మిలియన్ (2 కోట్ల 50 లక్షలకు పైగా) క్లిక్స్ తో ఉంది. ఈ పాట విడుదలై మూడు సంవత్సరాలు గడిచినా గానీ, దీనిని కొట్టే పాట లేకపోయింది. అసలే 1500 కోట్ల క్లబ్ ను సృష్టించబోతున్న సినిమా… మరి బన్నీ రికార్డును ఈ ‘సాహోరే బాహుబలి’ పక్కన పెట్టె అవకాశాలు లేకపోలేదు.

సినిమా విడుదలకు ముందే యూ ట్యూబ్ ను కూడా ఒక షేక్ చేసిన ఘనత ‘బాహుబలి 2’ ఖాతాలో ఉంది. ఆలిండియా పరంగా అత్యధిక లైక్స్ అందుకున్న ట్రైలర్ గానూ, అత్యధిక క్లిక్స్ అందుకున్న జుక్ బాక్స్ గానూ ‘బాహుబలి 2’ ఖాతాలో చెరపలేని రికార్డులు ఉన్నాయి. ఇక వరుసగా విడుదల కాబోతున్న వీడియో సాంగ్స్ మళ్ళీ యూ ట్యూబ్ ను షేక్ చేయకుండా ఉంటుందా..! చూడాలి మరి… బన్నీ రికార్డులను చెరిపివేయడానికి ప్రభాస్ ఎంత సమయం తీసుకుంటాడో..!