Baahubali 2 Release date sentiment in tollywoodధోని బ్యాటింగ్ ఆడుతూ సిక్సర్ కొట్టినపుడు ఏ పొజిషన్ లో ఉంటాడో… అదే పొజిషన్ లో ఉంటే అలాగే సిక్సర్లు కొడతాడన్న నమ్మకాన్ని ‘జులాయి’ సినిమాలో త్రివిక్రమ్ ఎలా చూపించారో అందరికీ తెలిసిందే. ఇలాంటి సెంటిమెంట్లు, నమ్మకాలకు సినీ ఇండస్ట్రీలో కొదవలేదు. అలాంటి ఓ సెంటిమెంటే ప్రస్తుతం ‘బాహుబలి 2’ విషయంలో హాట్ టాపిక్ గా మారింది.

అదే ఏప్రిల్ 28వ తేదీ. సాధారణంగా అయితే ఈ రోజుకు పెద్ద విశిష్టత లేదు గానీ, అయ్యప్పస్వామి జన్మదినం కావడంతో భక్తులకు గుర్తుగా నిలిచిపోతుంది. కానీ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రం ‘బ్లాక్ బస్టర్స్’ను అందించే రోజుగా ఖ్యాతిని గడించింది. గతంలో ప్రిన్స్ మహేష్ బాబు “పోకిరి” సినిమా విడుదలై, టాలీవుడ్ ఈక్వేషన్స్ ను మార్చేయగా, తాజాగా ‘బాహుబలి 2’ విడుదలై ‘గేమ్ చేంజర్’గా నిలిచింది.

అయితే ఇదేమీ మహేష్ ‘పోకిరి’ నుండి మొదలు కాలేదు, అప్పట్లో ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పిన “అడవి రాముడు” సినిమా కూడా ఇదే రోజున విడుదలై, ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. అయితే తాజాగా విడుదలైన ‘బాహుబలి 2’ ఫలితంతో ట్రేడ్ వర్గాల్లో నమ్మకం మరింతగా బలపడింది. దీంతో మరుసటి ఏడాది నుండి ఏప్రిల్ 28 కూడా ఒక హాట్ టాపిక్ గా మారుతుందేమో చూడాలి.