Varun Tej Fidaa breaks jr ntr recordsతెలుగు సిల్వర్ స్క్రీన్ పైనే కాక, అనేక ఏరియాలలో ‘బాహుబలి 2’ లెక్కలేనన్ని రికార్డులను సొంతం చేసుకుంది. అందులో యూ ట్యూబ్ కు సంబంధించిన క్లిక్స్ కూడా ఉన్నాయి. సినిమా ఘనవిజయం సాధించడంతో, ఆ తర్వాత రిలీజ్ అయిన వీడియో సాంగ్స్ క్లిక్స్ రికార్డులు కూడా ‘బాహుబలి 2’ పేరిటే ఉన్నాయి. అయితే ఎంత ‘బాహుబలి’ అయినా దేవసేనను చూసి ఫ్లాట్ అయినట్లు, తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ‘బాహుబలి 2’ తర్వాత విడుదలైన ‘ఫిదా’ పిల్ల సాయిపల్లవిని చూస్తూ ఫ్లాట్ అవుతున్నారు.

అవును… ‘బాహుబలి 2’ పేరిట ఉన్న ‘సాహోరే బాహుబలి’ వీడియో సాంగ్ క్లిక్స్ ను ‘వచ్చాడే’ సాంగ్ బద్దలు కొట్టింది. ‘బాహుబలి 2’ వీడియో సాంగ్ మే 18, దాదాపుగా ఏడాది క్రితం విడుదల కాగా, ఇప్పటివరకు 114 మిలియన్ క్లిక్స్ ను దాటి 115 క్లిక్స్ కు చేరువలో ఉంది. అయితే ఈ రికార్డును గతేడాది సెప్టెంబర్ 23న విడుదల చేసిన ‘ఫిదా’ పాట 115 మిలియన్ క్లిక్స్ తో బద్దలు కొట్టి, తెలుగు వీడియో సాంగ్ క్లిక్స్ లో అగ్ర స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ రెండింటి కంటే ముందు రష్మి ‘గుంటూరు టాకీస్’ పాట మరియు బన్నీ ‘రేసుగుర్రం’ పాటలు వీడియో సాంగ్స్ క్లిక్స్ లో రికార్డులు సాధించాయి.