Baahubali 2 Ratings - S. S.Rajamouliప్రస్తుత రోజుల్లో రివ్యూల ప్రభావం సినిమాలపై ఎంతమేరకు ఉందో అందరికీ తెలిసిందే. సినిమా విడుదలైన మరుక్షణమే ప్రత్యక్షమయ్యే రివ్యూల కోసం వేచిచూసే సినీ అభిమానుల సంఖ్యకు కొదవలేదు. సినిమా చూసినా, లేకున్నా గానీ ‘రివ్యూ’లను మాత్రం చూడకుండా విడిచిపెట్టడం లేదు అని చెప్పడంలో సందేహం లేదు. అయితే అన్ని సినిమాల మాదిరే ‘విజువల్ వండర్’గా తెరకెక్కిన “బాహుబలి 2” పైన కూడా రివ్యూల ప్రభావం ఉంటుందా? అంటే ఖచ్చితంగా అన్న సమాధానమే లభిస్తోంది.

నిజానికి ‘బాహుబలి పార్ట్ 1’ సినిమాకు రాజమౌళి కెరీర్ లోనే అతి తక్కువ రేటింగ్స్ ను సినీ విమర్శకులు ఇచ్చారు. అయినప్పటికీ ఆ సినిమా అంచనాలకు మించిన విజయం సాధించి, ‘ఔరా’ అనిపించింది. మరి అప్పుడు పడని ‘రివ్యూ’ల ప్రభావం ‘బాహుబలి 2’ పైన ఎలా పడుతుంది? అంటే… దానికి మిగిల్చిన ఒకే ఒక్క ప్రశ్న… ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అని! రివ్యూలో దీనిని పూర్తిగా చెప్పకపోయినప్పటికీ, ఈ ప్రశ్నకు సమాధానం ఆకట్టుకునే విధంగా చెప్పారా? లేక విమర్శలకు బదులిచ్చేలా చెప్పారా? అన్న దానిపైనే రేటింగ్స్ ఆధారపడి ఉంటాయని చెప్పవచ్చు.

రెండేళ్ళ పాటు ఊరించిన ఓ ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం ఇస్తే… రాజమౌళి కెరీర్ లోనే అత్యధిక రేటింగ్స్ తో ఈ సినిమాకు సినీ విమర్శకులు స్వాగతం పలికే అవకాశం ఉంది. దీంతో మరికొద్ది గంటల్లో సిల్వర్ స్క్రీన్ పై పడనున్న “బాహుబలి 2”కు విమర్శకులు ఎంత రేటింగ్ ఇస్తారనే దానిపై కూడా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యూఏఈ నుండి ఇచ్చిన ఉమైర్ సందు అయితే ‘ఫస్ట్ రివ్యూ’ అంటూ ఫుల్ మార్క్స్ ఇచ్చేసారు. మరి అదే స్థాయిలో ఇండియన్ ఫిల్మ్ క్రిటిక్స్ దగ్గర నుండి కూడా ‘బాహుబలి 2’ సంతృప్తికరమైన రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుందా?

దీని కోసం మరికొద్ది గంటలు వేచిచూడండి..! అప్పటివరకు వీక్షిస్తూ ఉండండి… మిర్చి9.కాం!