Baahubali 2 Latest Bollywood Newsఏప్రిల్ 28వ తేదీన ‘బాహుబలి 2’ విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే అంతకంటే ముందు మళ్ళీ ‘బాహుబలి’ సినిమాను చూపించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేసింది. మరికొద్ది గంటల్లో మరోసారి ‘బాహుబలి’ సినిమా సిల్వర్ స్క్రీన్ పై పడబోతోంది. విశేషం ఏమిటంటే… ఒక రెగ్యులర్ కొత్త సినిమా మాదిరే, ఈ సినిమా రీ రిలీజ్ కు కూడా అన్ని ధియేటర్లను సిద్ధం చేసారు. ఇండియాలో మూడు భాషలలో కలిపి దాదాపుగా 1000 ధియేటర్లలో ‘బాహుబలి’ సినిమా ప్రదర్శితం కానుందని తెలుస్తోంది.

అయితే ఇందులో ఎక్కువ శాతం వాటా హిందీ భాషకే చెందుతోంది. తెలుగులో విడుదల అవుతోన్నా, అది పరిమిత సంఖ్యలోనే ఉంది. అయితే హిందీలో ముందస్తు అడ్వాన్సు బుకింగ్ లలో ఒక కొత్త సినిమా మాదిరి ‘హౌస్ ఫుల్స్’ పడడం, ‘బాహుబలి’కున్న క్రేజ్ ను చాటిచెప్తోంది. చూడబోతుంటే మళ్ళీ బాలీవుడ్ నుండి ఓ 100 కోట్లు ‘బాహుబలి’ ఖాతాలో వేసేటట్లు కనపడుతున్నారు. దీనికి మరింత ఊతమిచ్చే విషయం ఏమిటంటే… ఈ రీ రిలీజ్ ను 17వ తేదీ లోపున చూసిన వారికి, ‘బాహుబలి 2’ టికెట్స్ ను కేటాయించే విధంగా ప్లానింగ్ నిర్వహించారు.