Baahubali 2 - Harish Shankar Post Piracy‘బాహుబలి’ పార్ట్ 1 సినిమా అనేక ప్రశ్నలను మిగిల్చిన విషయం తెలిసిందే. అందులో ప్రధానమైనది బాహుబలి – కట్టప్పల మర్డర్ ఉదంతం. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే కధ లీకై ప్రచారంలో ఉంది. అయితే కధ చదివిన తర్వాత సినిమా చూస్తే ‘కిక్’ ఏముంటుంది? ఒక విధంగా ఆ ‘ట్విస్ట్’ తెలిసిపోతే, ఏకంగా సినిమా పైనే ఆసక్తి తగ్గిపోవచ్చు. కనుక సదరు లీకేజ్ సమాచారాన్ని పాఠకులకు తెలియజేసి, ఆ ఆసక్తి లేకుండా చేయడం కంటే… సిల్వర్ స్క్రీన్ పైనే దానిని చూసి ఆనందించడం మంచిదన్న భావాలను దర్శకుడు హరీష్ శంకర్ తో సహా పలువురు సినీ ప్రముఖులు వ్యక్తపరుస్తున్నారు.

కధకు ప్రాణం పోసిన కుటుంబం…. 1128 రోజుల కష్టం… 132 కోట్ల ఖర్చు…. 900 మంది శ్రమ… ఒక సినిమా కోసం తన పెళ్లినే వాయిదా వేసుకున్న హీరో… అంటూ హరీష్ శంకర్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఓ పిలుపునిచ్చారు. ధియేటర్ లోని సన్నివేశాలు గానీ, స్క్రీన్ షాట్స్ ను గానీ ఎవరూ ఎలాంటి వీడియోలను గానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దు, చేసి చిత్ర యూనిట్ శ్రమను వృధా చేయవద్దు అంటూ హరీష్ శంకర్ చేసిన విజ్ఞప్తి సమయస్పూర్తిగా ఉందని చెప్పవచ్చు. రెండు సంవత్సరాలుగా వేచిచూసిన ఆనందాన్ని తనివితీరా అనుభవించాలంటే సిల్వర్ స్క్రీన్ పై చూసే వరకు వెయిట్ చేయమని అసలు ఉద్దేశం!