baahubali-2-conclusion-super-hit-pakistanప్రపంచం మొత్తాన్ని ఊపేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న “బాహుబలి 2” మేనియా, ఇండియా శత్రు దేశమైన పాకిస్తాన్ ను కూడా తాకింది. ఇండియాలో కంటే ఒక వారం ఆలస్యంగా విడుదలైన ఈ సినిమా కోసం పాకిస్తానీయులు కూడా ఆసక్తిగా ఎదురుచూసారన్న విషయం ‘హౌస్ ఫుల్’ బోర్డుల రూపంలో దర్శనమిచ్చాయి. తొలిరోజు నాడు పాకిస్తాన్ లోని ప్రముఖ పట్టణాలైన కరాచీ, లాహోర్ లలో ‘బాహుబలి 2’ కోసం ప్రేక్షకులు క్యూలు కట్టడంతో ధియేటర్లు కిక్కిరిసాయి.

చూడబోతుంటే… పాకిస్తానీయులు కూడా ‘బాహుబలి 2’కి పట్టాభిషేకం చేసే విధంగా కనపడుతున్నారు. ఇప్పటికే 1000 కోట్లు దాటిన ఈ సినిమా కలెక్షన్స్ ను మరింత పెంచేందుకు పాకిస్తాన్ మార్కెట్ కూడా ఓ చేయి వేస్తుందన్న విషయం స్పష్టమైంది. మరో వైపు యుఎస్ మార్కెట్ లో ఇప్పటికే 15 మిలియన్ డాలర్స్ దాటి, ఇండియన్ కరెన్సీలో 100 కోట్లను అధిగమించిన ఈ సినిమా, ఓవరాల్ గా ఎంతలో ల్యాండ్ అవుతుందో కూడా అంచనాలకు అందని రీతిలో ఉంది.