Baaghi-2-Ek-Do-Teen-Song1990ల్లో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ‘తేజాబ్‌’ సినిమాలో మాధురీ దీక్షిత్ ఆడిపాడిన ‘ఏక్‌ దో తీన్‌…’ పాట గుర్తుందా? ఆ పాటకు రీమిక్స్ వెర్షన్ వచ్చేసింది. బాలీవుడ్ రియల్ లైఫ్ హాట్ కపుల్ టైగర్‌ ష్రాఫ్‌, దిశా పటానీ జంటగా నటిస్తున్న ‘బాఘి 2’ సినిమాలో ఈ పాటను దర్శకుడు, కొరియోగ్రాఫర్ అహ్మద్‌ ఖాన్‌ పెట్టాడు.

2016లో వచ్చిన ‘బాఘి’ సినిమాకు ఇది సీక్వెల్‌ గా రూపొందుతోన్న ఈ సినిమా మార్చి 30న విడుదల కానుంది. ఈ పాటలో మాధురి దీక్షిత్ స్థానంలో మోహినీగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నర్తించింది. అలాగే అప్పట్లో ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్‌ ఆలపించగా, ప్రస్తుత రీమిక్స్‌ పాటను టాప్ సింగర్ శ్రేయా ఘోషల్‌ పాడింది.

స్వతహాగా కొరియోగ్రాఫరైన అహ్మద్ ఖాన్ పాత పాటతో ఈ పాటను పోల్చకుండా వుండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఒకే ఒక్క స్టెప్పు మినహా మిగిలినవన్నీ కొత్త స్టెప్పులను కంపోజ్‌ చేసాడు. అయితే మాధురి సాంగ్ తో పోలిస్తే… అంత ఊపు లేదన్నది వాస్తవం. ఏది ఏమైనా ఈ పాటకున్న క్రేజ్ రీత్యా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.