Ayyanna Patruduగడిచిన ఆరు మాసాలుగా తెలుగుదేశం నేతల్లో మాంచి ఊపొచ్చింది. తొలి రెండేళ్ల పాటు సైలెన్స్ గా ఉన్న టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తూ తమ ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. ఆ క్రమంలో తాజాగా వైసీపీ నేతల ఒక్కొక్కరి పేర్లు చెప్తూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు వేసిన పంచ్ లు బాగా పేలాయి.

ఒకరేమో బెట్టింగ్ మంత్రి, ఈ బెట్టింటే మంత్రే ఇరిగేషన్ మంత్రి కూడా. ఇరిగేషన్ గురించి అ, ఆలు కూడా రావు, ఆయనే ఇరిగేషన్ మంత్రి. దేవదాయశాఖామంత్రి… కొబ్బరి చిప్పలు అమ్ముకున్న మంత్రి దేవాదాయశాఖ మంత్రి. అంబటి రాంబాబు… నాకు గంట చాలంటాడు, దేనికి గంట? గంట చాలండి అంటాడు, దేనికి?

అందుకే మొన్న గుంటూరులో అన్నాను… ఇవన్నీ ఎందుకు మల్లెపూలు అమ్ముకోవయ్యా అన్నాను. కరెక్టుగా సూట్ అయ్యేది ఏమిటంటే మల్లెపూలు అమ్ముకో. ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన సీఎం అనే వ్యక్తి చేయాల్సిన పనులేంటండీ… సంక్షేమ పధకాలా? విద్యను అందించడమా? ఇరిగేషన్ సక్రమంగా చేయడమా? రహదారులు నిర్మించడమా? పరిశ్రమలు తీసుకురావడమా? అభివృద్ధి చేయడమా? ప్రజలకు సేవ చేయాల్సింది పోయి, ఏం చేస్తాడండీ ఈయన.

ముఖ్యమంత్రి చేసేది చేపలు అమ్ముకుంటాను, మాంసం అమ్ముకుంటాను, ఏంటండీ ఈయన. ముఖ్యమంత్రి చేయాల్సింది ఇదా అండి అంటూ నిలదీసారు. అందుకే అన్నాను నేను, ‘బ్రాందీ షాపుల దగ్గర చీకులు అమ్ముకోమన్నాను’ ఏం పనులండి అవి, పరిపాలన తెలియదు, మాట్లాడడం తెలియదు, టూరిజం శాఖకు వెన్న తెస్తాడట… అంటూ అయ్యన్న పాత్రుల వారు వేసిన మాస్ పంచ్ లు అక్కడున్న వారినే కాదు నెటిజన్లను కూడా విశేషంగా ఆకర్షిస్తున్నాయి.