Avengers-Creating-Problems-For-Tollywood-–Shocking-Bollywoodహాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ‘అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్’ సినిమా ప్రేక్షకులను విపరీతంగా రంజింపచేస్తోంది. ముఖ్యంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం, ‘అవెంజర్స్’కున్న ప్రజాధరణను చాటిచెప్తోంది. తొలి మూడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద (అన్ని భాషలలో కలిపి) ఏకంగా 120.90 కోట్లు వసూలు చేయడం విశేషం. ఈ రేంజ్ లో వసూలు చేసిన తొలి డబ్బింగ్ మూవీగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

తొలిరోజు 31.30 కోట్ల షేర్ తో అదిరిపోయే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ‘అవెంజర్స్’ అదే దూకుడును కొనసాగిస్తూ… రెండవ రోజు 30.50 కోట్లు, మూడవ రోజు సండే కావడంతో ఏకంగా 32.50 కోట్లతో తొలి 3 రోజులకు గానూ 94.30 కోట్లు కొల్లగొట్టి, మండేతో 100 కోట్ల షేర్ ను అందుకోవడం ఖాయం చేసుకుంది. సమ్మర్ సీజన్ కావడం, బాలీవుడ్ నాట చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడం కూడా ‘అవెంజర్స్’కు బాగా కలిసి వచ్చిన అంశాలు.