Avengers-Creating-Problems-For-Tollywood-–Shocking-Bollywoodఏప్రిల్ 27వ తేదీ విడుదల… దీని కోసం టాలీవుడ్ లో రెండు బడా సినిమాలు పోటీపడ్డాయి. ఇంతలో ఆలిండియా సూపర్ స్టార్ అదే డేట్ ను ప్రకటించడం సంచలనం రేపింది. అయితే ఈ డేట్ కు ఆ ఇద్దరు టాలీవుడ్ హీరోలతో పాటు, ఆలిండియా సూపర్ స్టార్ కూడా రాలేదు. హాలీవుడ్ స్టార్ హీరోలందరూ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై దండయాత్ర చేసారు.

“అవెంజేర్స్ ఇన్ఫినిటీ వార్” పేరుతో విడుదలైన ఈ సినిమా తొలి రోజు భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. ఈ ఏడాదిలో బాలీవుడ్ నాట అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా ఇది నిలవడం విశేషం. హిందీతో పాటు మిగిలిన డబ్బింగ్స్ తో కలుపుకుని దాదాపుగా 31 కోట్ల పైబడి వసూలు చేయడం సరికొత్త రికార్డుగా నిలిచింది. దీని తర్వాత స్థానంలో ‘భాగి 2’ 25 కోట్లతో నిలిచింది.

ఈ ఓపెనింగ్స్ తో హాలీవుడ్ డబ్బింగ్ బొమ్మలలో “అవెంజేర్స్ ఇన్ఫినిటీ వార్” ఆల్ టైం రికార్డును సాధించబోతుందన్న విషయం స్పష్టమైంది. అంతకుముందు ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియాస్ 7’ మరియు ‘జంగిల్ బుక్’ సినిమాలు 100 కోట్ల క్లబ్ లో నిలువగా, ‘అవెంజర్స్’ దూకుడు చూస్తుంటే, ఆ మార్కెట్ ను రెండింతలు చేసే విధంగా కనపడుతోంది.