Avengers-Infinity-War-Collectionsఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోన్న “అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్” సినిమా హంగామా ఇప్పట్లో ముగిసేలా కనపడడం లేదు. గత వారం విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ అదే దూకుడును కొనసాగిస్తూ 200 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, 300 కోట్ల వైపుకు పరుగులు పెడుతోంది. ఈ శుక్రవారంతో 200 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించిన ఈ మూవీ, ఈ వీకెండ్ లో రికార్డ్ వసూళ్లను సాధించే అవకాశం ఉందన్నది ట్రేడ్ టాక్.

ఇక నెట్ పరంగా 160 కోట్ల పై చిలుకు వసూలు చేసిన ఈ సినిమా రెండవ వారం ముగిసే నాటికి 200 కోట్ల నెట్ వసూళ్లు చేయడం ఖాయంగా కనపడుతోంది. మొత్తానికి ఇండియన్ బాక్సాఫీస్ ను హాలీవుడ్ బొమ్మ ఓ రేంజ్ లో అదరగొడుతోంది. చాలా కాలం తర్వాత బాలీవుడ్ లో ధియేటర్లు ‘అవెంజర్స్’ బొమ్మతో కళకళలాడుతున్నాయి. ఈ సినిమా ప్రభావం ఇతర భారీ చిత్రాలపై కూడా ఎంతోకొంత పడిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.