Avatar-2-The-Way-of-Waterహాలీవుడ్ అద్భుతం, విజువల్ వండర్ ‘అవతార్-2’ సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. మోషన్ కాప్చర్ విధానంలో అద్భుతమైన అనిమేషన్ టెక్నిక్స్ వాడి తీసిన అవతార్ సినిమా తోలి భాగం ఎన్నో రికార్డ్స్ సృష్టించింది. పన్నెండేళ్ల తరువాత రెండో భాగం రిలీజ్ అవుతుండగా..దర్శకుడు జేమ్స్ కామెరాన్ రిలీజ్ చేసిన టీజర్ అంచనాలను పెంచేసింది.

అవతార్ -2 సినిమా మేకింగ్ లో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు దాగున్నాయి. ఈ సినిమా కోసం జేమ్స్ కామెరాన్ సరికొత్త టెక్నాలజీ సృష్టించి, చాలా సమయం తీసుకుని ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకుండా తీస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా ఈ సినిమా నిడివి మూడు గంటల పది నిమిషాలు అని తెలిసింది.

ఇంగ్లీష్ సినిమాల్లో పాటలుండవు ..సినిమా గంటన్నర లోపే అయిపోతుంది. అయితే విజువల్ వండర్ అయిన అవతార్ -1 రెండుగంటల నలభై నిమిషాలు ఉన్నా.. ఆ టెక్నాలజీ కి ప్రేక్షకులు మంత్రముగ్ధులై సినిమాని చూసేసారు. జేమ్స్ కామెరాన్ కథ, కథనం ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉంటె, అవతార్ -2 నిడివి ఎంతవున్నా ఇబ్బందేం ఉండదు. మరి కొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వబోతున్న అవతార్ 2 ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.