Avanthi Srinivasa Raoటీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రాజీనామాపై ఆయన ఒకప్పటి సన్నిహితుడు, మంత్రి అవంతి శ్రీనివాస రావు స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దురదృష్టకరమని, ఎవరితో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని.. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పిస్తుందని, కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఎలాంటి పోరాటానికైన సిద్ధమని అవంతి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. మరో వైపు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ నేతలు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారని, ఉత్తుత్తి రాజీనామాలతో ఒరిగేది ఏమీలేదని మంత్రి మండిపడ్డారు.

గంటా శ్రీనివాస రావు రాజీనామాను పరోక్షంగా ఉత్తుత్తి రాజీనామా అన్నారు సరే… మరి వైఎస్సార్ కాంగ్రెస్ తరపు నుండి దానిని అడ్డుకోవడానికి చేస్తుంది ఏంటి? పోనీ ఉత్తుత్తి రాజీనామాల తో పని జరగదు అనుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ వారు సీరియస్ రాజీనామాలు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవొచ్చు కదా? అని నెటిజెన్లు అంటున్నారు.

“గంటా చేసింది ఉత్తుత్తి రాజీనామానే కావొచ్చు… అదే సమయంలో ముఖ్యమంత్రి నామమాత్రంగా రాసిన లేఖ వల్ల ఉపయోగం ఏంటి? గతంలో ప్రత్యేక హోదా కోరుతూ ఇటువంటి ఉత్తరాలు చాలానే రాశారు వాటివల్ల ఏం ప్రయోజనాలు ఒనగూరాయి? గంటా శ్రీనివాస రావు రాజీనామా,” అని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.