Australian-captain-Steve-Smith-abusing-Murali-Vijayఆస్ట్రేలియన్ కెప్టెన్ల సంస్కృతిని తాజా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కూడా ప్రదర్శించాడు. ‘తను చేస్తే సంసారం, ఎదుటి వారు చేస్తే వ్యభిచారం’ అన్న రీతిలో వ్యవహరించే గత ఆస్ట్రేలియన్ కెప్టెన్ల మాదిరే… సోమవారం నాడు భారత జట్టులోని మురళీ విజయ్ పై ‘ఫ… చీటర్’ అంటూ దుర్భాషలాడాడు. 137 పరుగులకు 9 వికెట్లు నష్టపోయి తీవ్ర కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో… చివరి వికెట్ గా హాజిల్ వుడ్ క్యాచ్ అందుకున్న మురళీ విజయ్ సంబరాల్లో మునిగిపోయి, ఇన్నింగ్స్ ముగిసిందని పెవిలియన్ ఎండ్ దాకా చేరుకున్నాడు.

అయితే టీవీ రిప్లైలో బంతి గ్రౌండ్ కు టచ్ అయినట్లుగా కనపడడంతో ఎంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. ఈ సమయంలో ఆక్రోశానికి లోనైన స్మిత్, మురళీ విజయ్ పై ‘అన్ సెన్సార్డ్’ పదజాలంతో స్పందించాడు. ఇది కాస్త మీడియాలో రికార్డ్ కావడంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది. అయితే తాను క్యాచ్ ను సరిగానే అందుకున్నానని, బంతి క్రిందే చేయి పెట్టినట్లుగా కెప్టెన్ రెహానేకు మురళీ విజయ్ వివరించడం కూడా టీవీలలో కనపడింది. అంటే ఇది మురళీ విజయ్ కావాలని చేసిన పని కాదని తేలింది.

ఒకవేళ అలా చేసినా మరో సాటి క్రికెటర్ ను కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టీవెన్ స్మిత్ అనవచ్చా? ఆసీస్ క్రికెటర్లకు కనీస నైతికత కూడా ఉండదని ఈ సందర్భంగా స్మిత్ కూడా చాటిచెప్పాడు. రెండవ టెస్ట్ మ్యాచ్ లో తాను అవుట్ అయినపుడు, పెవిలియన్ ఎండ్ లో ఉన్న తన జట్టును ‘రివ్యూ’ కోరిన ఘనత ఈ స్మిత్ గారి సొంతం. ఇలాంటి స్మిత్ గారు, భారత జట్టు సభ్యుల పైన కామెంట్లు చేసే అర్హత ఉందా? సిరీస్ ఓడిపోతున్నామనే బాధలో నోటికి ఏది వస్తే అది మాట్లాడడం తమ హక్కుగా భావిస్తున్నారేమో గానీ, స్మిత్ ద్వారా ఆసీస్ వంకర బుద్ధి మరోసారి ప్రపంచానికి తెలిసివచ్చింది.