Attarintiki-Daredi remake in Tamilపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో చివరి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన త్రివిక్రమ్ “అత్తారింటికి దారేది” సినిమాను తమిళంలోకి రీమేక్ చేయబోతున్నారు. ఈ సినిమాలో విజయ్ హీరోగా చేయబోతున్నారనేది ప్రాధమికంగా లభించిన సమాచారం గానీ, అధికారికంగా ఈ విషయం ఖరారు కావాల్సి ఉంది.

తమిళ ఇండస్ట్రీకి చెందిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేసింది. ఇటీవల కాలంలో వరుసగా భారీ సినిమాలను నిర్మిస్తోన్న ఈ సంస్థ రీమేక్ హక్కులను తీసుకోవడంతో, ఇందులో బడా స్టార్ నటించనున్నాడనేది తధ్యం. అయితే అది విజయ్ నా? కాదా? అన్నది తెలియాల్సి ఉంది.

అయితే ఈ సినిమా కంటే త్రివిక్రమ్ కెరీర్ లో ఇప్పటివరకు ‘బెస్ట్ మూవీ’గా నిలిచిన “అతడు” సినిమాను రీమేక్ చేయడం ఉత్తమం అన్న చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంది. కమర్షియల్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచినప్పటికీ, కంటెంట్ పరంగా ‘అత్తారింటికి దారేది’ క్లైమాక్స్ మినహా పెద్ద స్టఫ్ లేదన్నది బహిరంగమే.