attack on chandrababu naidu with bombచిత్తూరు జిల్లా కుప్పం నియోజిక వర్గంలో ప్రతిపక్ష నేత తెదేపా నాయకుడు చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా కుప్పం బస్టాండ్ లో జరిగిన సభలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల ముందు మద్యపానం నిషేధం అంటూ ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారు. ఏవేవో బ్రాండులతో ప్రజల ఆరోగ్యాని దెబ్బతీస్తున్నారు అంటూ ఆయన జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అలాగే తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఇది రౌడీ పాలనలా తయారైందని పేర్కొన్నారు.

ఇక సభ సమీపంలో ఓ వ్యక్తి అనుమానస్పదంగా పట్టుబడ్డాడు. అతని దగ్గర బాంబులు ఉండటంతో తెదేపా కార్యకర్తలు అతనికి దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో చంద్ర బాబు పక్కనే ఉన్న సెక్యురిటీ పెర్సన్ తన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టు అడ్డు పెట్టి సభ నుండి కిందకి తీసుకెళ్ళాడు.

“నాపై బాంబులు వేస్తారా ? తెదేపా అలాంటి బెదిరింపులకు ఏమాత్రం భయపడదంటూ” చంద్రబాబు అన్నారు. ఈ సంఘటనతో కుప్పం సభలో చిన్నపాటి ఉద్రిక్తత నెలకొంది. అసలు ఆ వ్యక్తి ఎవరు ? అతన్ని పంపి కుప్పం సభలో బాంబులు వేయమని చెప్పేందెవరు ? తెలియాల్సి ఉంది. అయినా సభ జరుగుతుండగా ఇలాంటి దాడులకు పాల్పడే పోలిటిల్ కల్చర్ ఏమిటో ? మరి.