Athulya 'exposing in Yemaali teaserకోలీవుడ్ లో పలు హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వి.ఇ.దురై తాజా చిత్రం ‘ఏమాలి’. ఈ సినిమాలో శ్యామ్ జోన్స్, అతుల్యలు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ తరం యువత జీవన విధానాన్ని కథాంశాన్ని తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం… ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో ఉన్న డైలాగ్స్, సీన్లు నెట్టింట వైరల్ గా మారాయి.

హీరోయిన్ అతుల్య కురచ దుస్తులు ధరించి అందాలను ఆరబోయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అతుల్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో అతుల్య స్పందిస్తూ… టీజర్ లో ఉన్న సీన్లను చూసి తప్పుగా అర్థం చేసుకోవద్దని… తను పోషించింది చాలా మంచి విషయాలను చెప్పే పాత్ర అని ఫేస్ బుక్ లో తెలిపింది. అయితే, టీజర్ లో ఉన్న సీన్లు తనకు కూడా బాధగా అనిపించాయని… వాటిని తొలగించాల్సిందిగా దర్శకుడిని కోరుకుంటున్నానని చెప్పింది.