Atchannaidu Arrested: Complete Details of the Alleged Scamసీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నెల27న అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. పార్టీ కొత్త కమిటీలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించనున్నారు.

అయితే ఈ నియామకంపై తెలుగుదేశం పార్టీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈఎస్ఐ కేసులో అచ్చెన్న జైలుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. సుమారు 70 రోజులు జైల్లో ఉన్నారు. ఇటీవలే ఆయన బెయిలు పై విడుదల అయ్యారు. ప్రజల తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్నందుకే కేసులు బనాయించారని టీడీపీ వాదన.

అయితే ఈ కేసు వీగిపోయాకే ఈ ప్రకటన చేస్తే మంచిదని కొందరి అభిప్రాయం. అయితే మరికొందరు మాత్రం… వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై పోరాడుతుంది ఒక్క అచ్చన్నాయుడు మాత్రమే అని… మిగిలిన ఎమ్మెల్యేలు పార్టీ మారడమో లేక సైలెంట్ గా ఉండిపోవడమో చేస్తున్నారు.

ఈ తరుణంలో ఆయనకు బాసటగా నిలవడం ద్వారా నాయకులకు, క్యాడర్ కు పాజిటివ్ మెస్సేజ్ పంపినట్టు అవుతుంది అంటున్నారు. పైగా అచ్చెన్నాయుడు బీసీ వర్గానికి చెందిన నాయకుడు… అలాగే ప్రభుత్వం టీడీపీని ఇరుకునపెట్టాలని చూస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడు. పైగా వారి కుటుంబం ఎప్పటినుండో టీడీపీకి విధేయంగా ఉంది. దానితో అన్ని రకాల అచ్చెన్నాయుడే కరెక్ట్ అని చంద్రబాబు భావిస్తున్నారు.