India's Most Loved Politician, Atal Bihari Vajpayee Passed Awayభారత మాజీ ప్రధాని, రాజకీయ భీష్ముడు అటల్ బిహారీ వాజ్ పేయి మరణాన్ని ఎయిమ్స్ వైద్యులు అధికారికంగా ప్రకటించారు. జూన్ 11న వాజపేయి ఎయిమ్స్ లో అడ్మిట్ కాగా, ఈ సాయంత్రం 5గంటల 5 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లుగా ఎయిమ్స్ ప్రెస్ నోట్ స్పష్టం చేసింది. అయ్యారు. వాజ్ పేయి మరణవార్తతో విషాదఛాయలు అలుముకున్నాయి. 93 సంవత్సరాల వాజ్ పేయి జీవితాంతం బ్రహ్మచారిగా ఉండగా, నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకుని పెంచారు.

వాజ్ పేయి మరణంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. మరోవైపు వాజ్ పేయి నివాసం వద్దకు ప్రధాని మోడీ బీజేపీ నేతలు చేరుకున్నారు. ఎయిమ్స్ వైద్య బృందం పర్యవేక్షణలో గత 9 వారాలుగా నిలకడగానే ఉన్న ఆరోగ్యం, ఊహించని విధంగా గత 36 గంటలుగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. ఏది ఏమైనా బిజెపి రాజకీయ పితామహుడుగా వాజ్ పేయి పేరు దేశ ప్రజలలో సుస్థిరంగా నిలిచి ఉంది. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిద్దాం.