at-Nartanasala-Teaserసున్నితమైన సబ్జెక్ట్ లను టచ్ చేయడానికి అందరూ సాహసించరు. అయితే యువహీరో నాగశౌర్య మాత్రం అలాంటి సున్నితమైన సబ్జెక్ట్ తోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని “నర్తనశాల” టీజర్ స్పష్టం చేసింది. హీరోయిజాన్ని మాత్రమే ఇష్టపడే టాలీవుడ్ ప్రేక్షకులకు ‘గే’ కామెడీ ఏంటో రుచిచూపించడానికి నర్తనశాల” సిద్ధమవుతోంది.

ఆ హావభావాలను ప్రదర్శించడంలో దిట్ట అని క్లైమాక్స్ లో శౌర్య ప్రదర్శించిన ఎక్స్ ప్రెషన్స్ చెప్తున్నాయి. ట్రైలర్ కోసం ఇందులో జస్ట్ శాంపిల్ ని మాత్రమే వదిలినట్లున్నారు గానీ, ఫన్ జనరేట్ చేయడంలో టీజర్ సక్సెస్ అయ్యింది. మహతి సంగీతం అందించిన ఈ సినిమాకు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వం వహించారు. హీరోయిన్లుగా కాష్మిరా, యామినిలు కనువిందు చేయనున్నారు.