at-nartanasala-public-talk‘ఛలో’ సినిమాతో హీరోగానే కాక నిర్మాతగా కూడా సక్సెస్ అందుకున్న నాగశౌర్య, రెండవ సినిమాగా “@నర్తనశాల”ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. టీజర్ ఆకట్టుకునే విధంగా, ఫన్ రైజింగ్ గా ఉండడంతో సినిమాపై ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ప్రభావం ఆన్ లైన్ బుకింగ్స్ లో అస్సలు కనపడలేదు. బహుశా హరికృష్ణ మరణం ప్రభావమో ఏమో గానీ, ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ లేవు.

అయితే మౌత్ టాక్ తో కలెక్షన్స్ వస్తాయని భావిస్తే, తాజాగా అది కూడా ఆవిరి అయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కామెడీ కోసం ‘నాగశౌర్య అండ్ కో’ చేసిన ప్రయత్నాలు మాత్రమే తెరపై కనపడ్డాయి గానీ, హాస్యం పండలేదన్నది సినిమా ఫస్ట్ టాక్. ఇంటర్వెల్ కు రివీల్ అయిన ‘గే’ ట్విస్ట్ నుండి అయినా సినిమా గమనం మారుతుందని భావిస్తే అది కూడా అత్యాశగానే మారడం ప్రేక్షకులకు ఏ మాత్రం ఊరటనివ్వలేదు.

దర్శకుడిగా శ్రీనివాస్ చక్రవర్తి పూర్తి వైఫల్యం ఈ సినిమాలో కనపడుతుంది. హాస్యానికి స్కోప్ ఉన్న స్క్రిప్ట్ ను డీల్ చేయడంలో విఫలమైన దర్శకుడు, ఏ యాంగిల్ లోనూ సినీ ప్రేక్షకులను సంతృప్తి పరచలేకపోయారు. రిలీజ్ అయ్యిందో, లేదో కూడా తెలియని ‘అమ్మమ్మ గారిల్లు’ ఫెయిల్యూర్ తర్వాత ఖచ్చితంగా సక్సెస్ కావాల్సిన నాగశౌర్యకు ఈ “@నర్తనశాల” నిరాశను అందిస్తుంది. కాకతాళీయం ఏంటంటే… ఈ సినిమాలో ఫస్ట్ డైలాగ్ హరికృష్ణ మీదే ఉంటుంది.