At Nartanasala Egireney -Manasu Song“ఛలో” సినిమాతో నిర్మాతగా మారి సక్సెస్ కొట్టిన హీరో నాగశౌర్య, తన రెండవ సినిమాగా “నర్తనశాల”ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా జోష్ ఫుల్ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక తాజాగా ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసి ప్రమోషన్స్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ పాటను భాస్కరభట్ల రచించారు. హీరో-హీరోయిన్ల మధ్య స్టోరీ జరుగుతూ… సినిమాలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ఈ పాటను సంగీత దర్శకుడు మహతి స్వయంగా పాడగా, లేడీ వాయిస్ ను సమీరా భరద్వాజ్ వినిపించారు. ‘ఎగిరేనే మనసు’ అంటూ మెలోడీగా సాగిన ఈ పాట జస్ట్ ఓకే అనేలా ఉంది.