Jr NTR next chief Ministerజూనియర్ ఎన్టీఆర్… ఓ అయిదారేళ్ళు గడిస్తే ముఖ్యమంత్రి హోదాలో కనిపిస్తారట. ఇదేదో ఫ్లూక్ గా చెప్తోంది కాదు, ఆయన జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అవపోశనం చేసిన తర్వాత చెప్తోన్న విషయం. అవును… నూటికి నూరు శాతం జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి హోదాలో కనిపించబోతున్నారు… ఇది రాసిపెట్టుకోండి… అంటూ ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి సెలవిచ్చారు.

గతంలో ఎన్నో విషయాలు చెప్పి మీడియాలో హాట్ టాపిక్ అయిన వేణుస్వామి కన్నులు, హరికృష్ణ మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పై పడ్డాయి. నాడు ఎన్టీఆర్ యాక్సిడెంట్ నుండి బయటపడడానికి, త్వరలో తారక్ ముఖ్యమంత్రి కావడానికి కూడా కారణం ఆయన జాతక ఫలమేనని, ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడడం తధ్యం అంటున్నారు వేణుస్వామి.

రవి, కుజ గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నాయి, శుక్రుడు – రాహువు కాంభినేషన్ రాజయోగం కనిపిస్తోంది, టిడిపి ధీనస్థితిలో ఉండగా జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వస్తుందని, ఒక్కసారిగా సిఎం అభ్యర్ధిగా ప్రకటించి, పీఠాన్ని అధిష్టిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలు చూసి నవ్వుకునే వారు నవ్వుకుంటుండగా, నిజమేనేమో… అయినా అవ్వొచ్చు… జాతకంలో ఉంటే ఎవ్వరూ తప్పించలేరు అంటూ అంటున్నారు.