Asia Cup 2018 - Team India Vs Pakistanఇండియా – పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే, అది ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. అలాంటిది చాలాకాలం తర్వాత బుధవారం నాడు తలపడిన ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్, వార్ వన్ సైడ్ గా మారిపోయింది. పాక్ కు ఎలాంటి అవకాశము ఇవ్వకుండా తొలుత బౌలింగ్ లో రాణించిన టీమిండియా, ఆ తర్వాత లక్ష్య చేధనను కూడా వేగంగానే ముగించింది.

దీంతో ప్రేక్షకులకు ఆశించినంత మజాను ఈ మ్యాచ్ ఇవ్వలేకపోయింది. అయితే ఇదే టోర్నీలో మరో రెండు సార్లు ఈ రెండు జట్లు తలపడే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. టాప్ 4లో భాగంగా ప్రతి జట్టు మరో జట్టుతో తలపడనుంది. ఇందులో భాగంగా ఈ నెల 23వ తేదీన టీమిండియా – పాకిస్తాన్ జట్ల మధ్య మరో మ్యాచ్ జరగనుంది.

అలాగే సూపర్ 4 లో భాగంగా జరిగిన మ్యాచ్ లలో టాప్ 2 జట్లు ఫైనల్ కు అర్హత పొందుతాయి. ఒకవేళ టాప్ 2లో ఇండియా – పాకిస్తాన్ జట్లు గనుక నిలిస్తే, మరోసారి ఫైనల్లో ఈ దాయాదీ దేశాలు తలపడడం లాంచనమే. మరో రెండు జట్లు బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లు కనుక, టాప్ 2లో ఇండియా, పాక్ లు నిలబడే అవకాశాలు ఎక్కువే. దీంతో మరో రెండు సార్లు ఇండియా – పాక్ లు తలపడడం ఖాయంగా కనిపిస్తోంది.