Ashok Leyland to set up unit in StateAshok Leyland to set up unit in Stateముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతిపథంలో దూసుకుని వెళ్తుంది. రాష్ట్రంలో బస్సుల తయారీ కేంద్రం నెలకొల్పడానికి అశోక్‌ లే ల్యాండ్‌ సంస్థ, ఉత్పత్తుల కేంద్రాన్ని స్థాపించేందుకు విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ముందుకొచ్చాయి.

భూ కేటాయింపులు, ఇతర అనుమతులు పూర్తయిన ఏడాదిలోగా తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబును కలిసిన అశోక్‌ లే ల్యాండ్‌ సంస్థ సీఎండీ వినోద్‌ కె దాసరి చెప్పారు. 75 ఎకరాలలో పెట్టబోతున్న ప్లాంటు ఏర్పాటు, బస్సుల తయారీ ప్రణాళిక వివరాలను అందించారు.

ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 4880 బస్సుల తయారీ మరియు 5 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అదేవిధంగా ఎలక్ట్రిక్‌ వాహనాల అభివృద్ధి కేంద్రం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే విప్రో ఉత్పత్తుల కేంద్రం యూనిట్‌ నెలకొల్పేందుకు రాష్ట్రంలో 40 ఎకరాల భూమిని కేటాయించాలని ఆ సంస్థ ముఖ్య ఆర్థికాధికారి రాఘవ్‌ స్వామినాథన్‌ సీఎంను కలిసి కోరారు.

సబ్బులు, ఎల్‌ఈడీ ఉత్పత్తులు తాయారు చెయ్యాలని ప్రణాళిక. దీనికోసం 200-350 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది ఆ సంస్థ. తొందర్లో వారు పెట్టిన ప్రతిపాదనలు కేబినెట్ ముందు పెట్టి నిర్ణయం తీసుకోనున్నారు. వారు కోరిన భూమి, ఇతర మినహాయింపుల మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు.