రెండేళ్ల క్రితం న్యూఢిల్లీలోని ఓ విలాసంతమైన హోటల్ గదిలో సునంద విగత జీవిగా కనిపించిన మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి విషయం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో నాడు శశి థరూర్ కేంద్ర మంత్రి హోదాలో ఉన్న శశిథరూర్ పై తీవ్ర అభియోగాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోవడానికి గల కారణం ఎట్టకేలకు తెలిసిపోయింది. నిద్రలేమి నివారణ కోసం వినియోగించే ‘ఆల్ ప్రాక్స్’ మందు కారణంగానే సునంద చనిపోయిందట.
‘ఆల్ ప్రాక్స్’ మోతాదు మితి మీరిన కారణంగానే ఆమె చనిపోయిందని ఇటీవల పోలీసులకు అందజేసిన నివేదికలో అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) తేల్చిచెప్పింది. అయితే ఆల్ ప్రాక్స్ ను సునందే స్వయంగా తీసుకున్నారా? లేక ఎవరైనా ఆమె శరీరంలోకి ఇంజెక్ట్ చేశారా? అన్న విషయం మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.