Arvind Dharmapuri ssays KCR government will fall in 6 monthsబీజేపీ నిజామాబాదు ఎంపీ ధర్మపురి ఎంపీ ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ తరపు స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ బీజేపీ, ఎంఐఎం మధ్యనే జరుగుతున్నాయని, తెరాసలో అసలు సోయాలోనే లేదని చెప్పుకొచ్చారు.

“పాత బస్తిలో పోరు బీజేపీ… ఎంఐఎం-తెరాస మధ్య జరుగుతుంది. న్యూ సిటీలో అయితే అసలు బీజేపీకి పోటీనే లేదు. నా అంచనా ప్రకారం తెరాస కు పది సీట్ల లోపే వస్తాయి. సింగల్ డిజిట్ అయితే ఖాయం. ఆ తరువాత ఆరు నెలలలో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయి మధ్యంతర ఎన్నికలు రావడం ఖాయం,” అని ఆయన చెప్పుకొచ్చారు.

“జీహెచ్ఎంసి ఎన్నికల తరువాత ఈ ప్రభుత్వం సజావుగా సాగడం కష్టం. ఆ పార్టీ నాయకులకు తమ భవిష్యత్తు మీద బెంగ వచ్చి బయటకు రావడం ఖాయం. రాజకీయాలలో నేడు కేసీఆర్ ఒక్క లిల్లీఫుట్. అసలు మోడీ, అమిత్ షాల తో ఆయనకు పోలికే లేదు. వచ్చే ఎన్నికలలో కేటీఆర్ సిరిసిల్లలో ఓడిపోవడం ఖాయం,” అంటూ జోస్యం చెప్పారు.

ఒకవేళ అరవింద్ అన్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి సింగల్ డిజిట్ కు పరిమితం అయితే తెలంగాణ రాజకీయాలలో అది సంచలనమే. ఒకవేళ అరవింద్ అన్నట్టు జరిగితే బీజేపీ తెలంగాణలోని ప్రభుత్వాన్ని కూలదోస్తాదా అనేది అనుమానంగా ఉంది.