Arun Vijay, Arun Vijay Drunk & Drive , Arun Vijay Drunk & Drive Accident, Arun Vijay Drunk & Drive Case, Arun Vijay Drunk & Drive Arrest, Arun Vijay Drunk & Drive Controversyప్రముఖ సినీ నటుడు విజయ్ కుమార్ కుమారుడు, తమిళ నటుడు అరుణ్ విజయ్ ‘డ్రంక్ అండ్ డ్రైవ్’లో పట్టుబడడ్డాడు. ‘ప్రియం’ సినిమాతో అరంగేట్రం చేసిన అరుణ్ విజయ్ పలు సినిమాల్లో నటించినా స్టార్ హీరోగా మాత్రం గుర్తింపు రాలేకపోయింది. అయితే గతేడాది శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘బ్రూస్ లీ’ సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయినప్పటికీ తెలుగులో కూడా పెద్దగా అవకాశాలు దరిచేరలేదు. తాజాగా ఓ ఫంక్షన్ కు భార్యతో కలిసి వెళ్లి వస్తున్న సమయంలో చెన్నైలో నుంగంబాక్కం పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాగానే ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు అరుణ్ విజయ్ దొరికాడు. దీంతో పోలీసులు అరుణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఇలా ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ కేసులలో పట్టుబడం చాలా సర్వ సాధారణంగా మారిపోయింది.