Arun Jaitley Finance ministerముందు 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా అన్నారు తరువాత ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌ 7వ తేదీ రాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విభజన చట్టంలో ప్రకటించిన హామీల అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని దాని బదులు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం అని ప్రకటించారు.

సరే ఏదో ఒకటి అని ప్రజలు కూడా సరిపెట్టుకున్నారు. ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాల మాదిరే విదేశీ ఆర్థిక సంస్థల నుంచి తీసుకొనే రుణంలో 90% కేంద్రమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. 2015-20 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విదేశీ ఆర్థిక సంస్థల నుంచి తీసుకొనే రుణాలకు ఈ వెసులుబాటు వర్తింపజేస్తామని ప్రకటించారు.

ఐతే ఇవన్ని నీటి మీద రాతలే అని తేలిపోయాయి. ఏడాది గడిచినా ఈ విషయంలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడం, దానిపై కేంద్రం వివరణలు కోరడంతోనే పుణ్యకాలం గడిచిపోతోంది. విభజన కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రానికి నిరాశే ఎదురయ్యింది.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 19,161 కోట్ల విలువైన ప్రతిపాదనలు కేంద్రం వద్దకు పంపింది. ఆ ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు చెబుతూనే కేంద్రం రకరకాల షరతులు విధించించడం వల్ల రుణ వ్యవహారం ముందుకుసాగడం లేదు. కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తొలుత తన వాటా కింద 30% నిధులు ఖర్చు చేస్తేనే మిగతా రుణం గురించి ఆలోచిస్తామని చెబుతోంది. ఐతే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురుకుంటున్న రాష్ట్రానికి ఇది చాలా కష్టం. దానితో బాజపా ప్రభుత్వం స్పెషల్ ప్యాకేజ్ ని కూడా అటుక ఎక్కించే ప్రయత్నం చేస్తుంది.