pawan kalyan sardaar Gabbar singhమరికొద్ది రోజుల్లో రాబోతున్న కొత్త సంవత్సరం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోసం “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా టీజర్ ను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అంతకు ముందే తన అభిమాన హీరో ‘పోస్టర్’ను ఓ వీరాభిమాని సిద్ధం చేసి సోషల్ మీడియాలో వదిలారు.

పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ను స్కెచ్ గీస్తూ, తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేసారు. అలాగే ‘పవనిజం, జనసేన’ పేర్లును కూడా పొందుపరిచారు. ప్రస్తుతం ఈ ఫోటోను పవర్ స్టార్ అభిమానులు ఫేస్ బుక్, ట్విట్టర్ లలో షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు. క్రియేటివిటీలో పవర్ స్టార్ అభిమానులది ఓ ప్రత్యేక శైలి అని మరోసారి నిరూపించుకుంటున్నారు.